- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంటకు తెగులు సోకితే వ్యవసాయ శాఖ ఏం చేస్తోంది?
దిశ, కరీంనగర్:
వరి పంటకు మెడవిరుపు, అగ్గి తెగులు సోకితే వ్యవసాయ శాఖ ఏం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దొడ్డు రకం ధాన్యానికి తెగులు సోకితేనే నివారించలేని ప్రభుత్వం, సన్నరకం బియ్యానికి తెగులు పడితే ఎలా నివారిస్తుందో అర్థం కావడం లేదన్నారు. పత్తి పంట వేయమంటున్న ప్రభుత్వం పత్తి విత్తనాల కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పత్తి ఏరడానికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న కూలీల కొరత ఎలా తీరుతుందన్నారు. రైస్ మిల్లర్ల నుంచి రైతులను కాపాడేందుకు దొడ్డు రకం ధాన్యాన్నికాంగ్రెస్ ప్రోత్సహిస్తే తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ సన్నరకం తీసుకువచ్చి మిల్లర్లకు హస్తగతం చేసేందుకు ప్రయత్నిస్తోందని జీవన్ రెడ్డి విమర్శించారు. సన్నరకానికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుందని, దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. పండిన పంటల వలన రైతులకు లాభం చేకూరాల్సింది పోయి పత్తి విషయంలో జిన్నింగ్ మిల్లులకు, ,సన్నరకం ధాన్యంతో మిల్లర్లకు లాభం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నియంత్రిత వ్యవసాయం పేరుతో రైతుల స్వేచ్ఛను టీఆర్‌ఎస్ ప్రభుత్వం హరించే యత్నం చేస్తోందన్నారు.