ఈ రంగాలకు అధిక నిధులు కేటాయించండి : ఎమ్మెల్సీ

by Sridhar Babu |
Mlc Alugubelli Narsireddy
X

దిశ, పాలేరు: నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాల్లో కలియదిరిగి అక్కడ నెలకొన్న సమస్యల వివరాలు వైద్యాధికారి డాక్టర్ రాజేష్‌ను అడిగి తెలుసుకున్నారు. 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, తగిన వైద్య సిబ్బంది, సామాగ్రిని ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్య, వైద్య రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు పౌర స్పందన వేదికను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తద్వారా సమస్యలు గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రెండు రంగాలకు అధిక నిధులు కేటాయించాలని, ప్రతీ పేదవాడికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని కోరారు. ఆయన వెంట పౌర స్పందన వేదిక జిల్లా నాయకులు రవికుమార్, కుటుంబరావు, యూటీఎఫ్ జిల్లా నాయకులు అరవింద్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గురవయ్య, అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed