రివాల్వర్‌తో షూట్‌ చేసుకుని ఎమ్మెల్యే కొడుకు సూసైడ్

by Anukaran |   ( Updated:2021-11-11 22:36:42.0  )
రివాల్వర్‌తో షూట్‌ చేసుకుని ఎమ్మెల్యే కొడుకు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కొడుకు రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. జబల్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కుమారుడు వైభవ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం బాత్‌రూమ్‌కి వెళ్లి ఓ రివాల్వర్‌తో నేరుగా తలపై కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. కాల్పుల మోత విన్న ఎమ్మెల్యే, కుటుంబీకులు హుటాహుటిన బాత్‌రూమ్ వద్దకు వెళ్లగా.. రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే స్థానిక హాస్పిటల్‌కి తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. తీవ్ర మానసిక ఒత్తిడితో షూట్ చేసుకున్నట్టు సూసైడ్‌ నోట్‌లో రాసినట్టు సమాచారం. కండ్ల ముందే ఎదుగుతున్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కన్నీరు మున్నీరుగా విలపించారు.

Advertisement

Next Story