- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే విడదల రజినికి ప్రమోషన్.. క్లారిటీ ఇచ్చేసిన మంత్రి
దిశ, ఏపీ బ్యూరో : విడదల రజిని ఏపీ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన వెంటనే ఆమె అసెంబ్లీ మెట్లెక్కేశారు. విడదల రజిని ఏం చేసినా ప్రచారం మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌పై విడదల రజినికి ప్రత్యేక ముద్ర ఉంది. ఈ విషయంలో ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. ఇటీవల కాలంలో ఆమెకు మంత్రిగా అవకాశం కూడా రావొచ్చంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న ఆయన విడదల రజినిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ధైర్యం చేసి విడదల రజినికి చిలకలూరిపేట సీటు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే రజినిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో విడదల రజిని అభిమానులు.. వైసీపీ కార్యకర్తలు విజిల్స్ మోత మోగించారు. సీఎం జగన్ సామాజిక న్యాయానికి చిలకలూరిపేటలో రజినికి సీటు ఇవ్వడం వద్ద నుంచే మెుదలైందని చెప్పుకొచ్చారు. జగన్ ఉన్నంత వరకు చిలకలూరిపేట రజినిదేనంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెగేసి చెప్పారు.