ఎమ్మెల్యే రాజాసింగ్ పేరుతో ఆడియోటేపు కలకలం..

by Anukaran |
ఎమ్మెల్యే రాజాసింగ్ పేరుతో ఆడియోటేపు కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపైనొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అంతేకాకుండా, ఆయా పార్టీల వీక్ నెస్‌లను ఆధారంగా చేసుకుని ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. దానికితోడు టిక్కెట్ల కేటాయింపుల్లో వచ్చిన తారతమ్యాల వలన కారు, కమలదళం నేతలు రెబల్స్‌ను బుబ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.

ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో ఇప్పుడిప్పుడే ముసలం ఛాయలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ ముఖ్య కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్లు కేటాయించకుండా, వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఎంటనీ ఆదివారం నగరంలోని పలు బీజేపీ కార్యాలయాల్లో కార్యకర్తలు దాడులకు దిగి ఫర్నిచర్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరుతో విడుదలైన ఓ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఇందులో ఆ ఎమ్మెల్యే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను బండి సంజయ్ మోసం చేశాడంటూ ఆడియో టేపులో రికార్డైంది. అంతేకాకుండా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వానికి లేఖ రాస్తానని రాజాసింగ్ అన్నట్లు సమాచారం. చివరగా, గ్రేటర్ ఎన్నికల్లో తన నియోజకవర్గం మినహా మిగతా డివిజన్లలో తాను జోక్యం చేసుకును. నియోజకవర్గంలోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయా అంటూ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ అసంతృప్తి కనబరిచారని తెలుస్తోంది. కాగా, ఈ ఆడియో టేపుపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed