వాళ్లు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు : రాజాసింగ్

by Shyam |
వాళ్లు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు : రాజాసింగ్
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: గ‌న్ ఫౌండ్రి డివిజ‌న్ పూల్ బాగ్ బస్తీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే అర్హులైన బస్తీ ప్రజలకు అందజేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హైద‌రాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని కోరారు. ఈ సోమ‌వారం ఆయ‌న గన్ ఫౌండ్రి డివిజన్ నూత‌న కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ భీష్మతో క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం రాజాసింగ్ మాట్లాడుతూ.. రెక్కాడితే గానీ డొక్కాడని పూల్ బాగ్ బస్తీ ప్ర‌జ‌లు గత 12 ఏండ్లుగా ఇండ్లు లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, అద్ధె ఇండ్ల‌లో ఉంటూ కిరాయిలు కట్టలేక, సరైన వసతులు లేక కుటుంబాలతో నిత్యం న‌ర‌కం అనుభ‌విస్తున్నార‌ని అన్నారు. వెంటనే వీరికి బస్తీలో ప్రభుత్వం క‌ట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పూల్ బాగ్ ప్ర‌జ‌ల‌కు తక్షణమే ఇండ్లు కేటాయించ‌క పోతే బీజేపీ తరపున భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Next Story