- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక రసాభాసగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు బాహాబాహీకి దిగారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. ఈ సమయంలో అనూహ్యంగా తెరాస కౌన్సిలర్ అంతటి విజయలక్ష్మి కాంగ్రెస్ సభ్యులకు మద్దతు తెలపడంతో వివాదానికి దారి తీసింది.
మున్సిపల్ చైర్మన్, తెరాస సభ్యులు ఎన్నిక వాయిదా వేయాలని కోరగా… కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఎన్నిక కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు. మున్సిపల్ చైర్మన్.. కో-ఆప్షన్ ఎన్నిక ప్రతులను చించడంతో స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కోరం ఉన్నా.. ఎన్నిక వాయిదా వేయడంపై జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెరాస కౌన్సిలర్ అంతటి విజయలక్ష్మికి భద్రత కల్పించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్థానిక పోలీసులను కోరారు.