- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్థిక మాంద్యంలోనూ జోరుగా అభివృద్ధి పనులు
by Shyam |

X
దిశ, పటాన్‌చెరు:
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉస్మాన్ నగర్, కొల్లూరు, బొజ్యతాండ, దేవుల తాండలలో రూ. 1.34 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, నీటి సంపు, వైకుంఠధామం అభివృద్ధి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు.
Next Story