- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆరు నెలలు అధికారం అప్పగిస్తాం’.. ప్రతిపక్షాలకు మాజీ మంత్రి భారీ సవాల్
దిశ, జడ్చర్ల : ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని యువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలకు ‘ఆరునెలలు అధికారం ఇస్తాం.. దమ్ముంటే కేంద్ర పార్టీ నాయకత్వంతో మాట్లాడి లెటర్ ఇవ్వాలని’మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శనివారం జడ్చర్ల పట్టణం తాలూకా క్లబ్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కమిటీ ఎన్నికల కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగాల పేరిట బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే తమ ప్రభుత్వం లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించిందన్నారు. మరో 50 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, జనాభా ప్రాతిపదికన ఒక శాతం ఉద్యోగాలు మాత్రమే రాష్ట్రంలో ఇస్తారని ఆయన అన్నారు. మరోవైపు దేశంలో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొలువుదీరినా అక్కడ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.
‘ఆరు నెలల పాటు మీకు అధికారాన్ని ఇస్తాం.. దమ్ముంటే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారా..? అంతేగాక దళిత బంధు, బీసీ బంధు పథకాలను అమలు చేస్తారా..’ అందుకు సంబంధించి జాతీయ పార్టీలతో లెటర్ ఇప్పిస్తారా.. అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.
రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేసిందని, టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ కాదని, ఉద్యమ పార్టీ అని లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా పనిచేస్తుందని అన్నారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రం గా తీర్చిదిద్దేడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ప్రారంభించుకున్నామని వివరించారు.ఆయన పాల్గొని పార్టీ నిర్ణయించిన గడువులోగా పార్టీ యంత్రాంగం మొత్తం సంస్థాగత కమిటీల నిర్మాణలను పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా పట్టణములోని వార్డు కమిటీల ప్రక్రియను ప్రారంభించారు. అలాగే, కమిటీల నియామకంలో సామాజిక వర్గాల సమతూకం పాటించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
- Tags
- mla laxmareddy