- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్వరాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి సరైన నాయకత్వం లేకపోవడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం సరైన నాయకుడు రేవంత్ రెడ్డిని నియమించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, పార్టీ పుంజుకోవడం ఇక జరుగబోదని తాను ఇదివరకు చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అని ఒప్పుకున్నారు.
ఇక నుంచి పార్టీని విమర్శించడం గానీ, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం గానీ చేయబోనని స్పష్టం చేశారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నా.. ఇకనుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. కాగా, గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని బహిరంగ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో కొనసాగుతా అని స్పష్టం చేయడంతో బీజేపీలో చేరుతాడునుకున్న నేతలకు భారీ షాక్ తగిలినట్టైంది.