- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక గాంధీ కోసం ఆందోళన.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు
దిశ, సంగారెడ్డి : యూపీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అరెస్ట్‌కు నిరసనగా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించి దాదాపు గంట పాటు ఆందోళన చేశారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకొవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్వివాదానికి దిగారు.
దీంతో రోడ్డు పై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నా ప్రధాని మోదీలో మార్పు రావడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హోంమంత్రి కుమారుడి పాశవిక చర్యల కారణంగా మరణించిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనను విరమింపజేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డిని, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డిని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తొపాజి అనంత కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్న శంకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పైన సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కసిని రాజు, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్, వై ప్రభు, గాంగేరి శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.