కరోనా మరణాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణ

by vinod kumar |
mla jaggareddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత తీర్చాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడిందని, ఈ ఇంజక్షన్ల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో రోజూ 200 నుంచి 300 మంది కరోనాతో చనిపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర అశ్రద్ధ చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మెడికల్ షాపులో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed