బతుకమ్మ చీరల కోసం రూ.360 కోట్లు ఖర్చు చేశాం : ఎమ్మెల్యే గండ్ర

by Shyam |   ( Updated:2021-10-03 06:11:38.0  )
బతుకమ్మ చీరల కోసం రూ.360 కోట్లు ఖర్చు చేశాం : ఎమ్మెల్యే గండ్ర
X

దిశ, చిట్యాల : చేనేత కార్మికులు నేసిన చీరలకు రూ.360 కోట్లు ఖర్చు చేసి తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.అయితే, కొంతమంది ప్రతిపక్ష నాయకుల ప్రోద్బలంతో మహిళలు చీరలను దహనం చేశారని గండ్ర తెలిపారు. శనివారం కైలాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ కొంతమంది మహిళలు బతుకమ్మ చీరలు దహనం చేయగా.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి చేరుకుని ఆదివారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరలు స్వయంగా చేనేత కార్మికులు నేసినవని తెలిపారు. కావాలనే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయ దురుద్దేశంతో వాటిని దహనం చేసేలా కుట్ర పన్నారన్నారు.ఈ విషయం హైదరాబాద్ మహానగరం దాగా వెళ్ళిందన్నారు. ప్రభుత్వం అందించిన కొత్త చీరలను దాచి పెట్టుకొని కావాలంటే పాత చీరలను తగలబెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

ఇలాంటివి చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎరుకొండ గణపతి, స్థానిక సర్పంచ్ చింతల శ్వేత, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుడు కామిడి రత్నాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆరపెల్లి మల్లయ్య,నాయకులు చింతల సుమన్ పువ్వాటి వెంకన్న, కర్రె అశోక్ రెడ్డి, చిలుముల రమణా చారి, ఎరుకొండ రాజేందర్, సుంకరి మహేశ్వర, గుర్రం తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed