- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దపల్లి ఎమ్మెల్యే చొరవతో తగ్గిన అంబులెన్సు ధరలు
దిశ, పెద్దపల్లి : కరోనా మహమ్మారి బారిన పడి ఆస్పత్రులకు వెళ్లే సమయంలో అంబులెన్స్ ధరలను చూసి రోగులు బెంబేలెత్తుతున్న విషయం తెలిసిందే. అది గ్రహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అంబులెన్స్ ధరల తగ్గింపు కోసం చేసిన కృషి ఫలించింది. బుధవారం ఎమ్మెల్యే అంబులెన్స్ అసోసియేషన్ నాయకులతో చర్చించారు. ఆపద సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరడంతో ధరలు తగ్గించేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు.
ఇప్పటివరకు కరోనా రోగులను కరీంనగర్ ఆస్పత్రులకు తరలించేందుకు రూ.5000 తీసుకుంటుండగా ఇకపై ఆక్సిజన్ అవసరం లేకుండా జిల్లాకు తరలిస్తే 2500, ఆక్సిజన్ అమర్చి ఆస్పత్రికి తరలిస్తే రూ.3,000 తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. సాధారణ రోగులను కరీంనగర్‌కు తరలించేందుకు రూ.2 వేలు తీసుకుంటామని ప్రకటించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఆంబులెన్స్ ధరలు తగ్గడం పెద్దపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.