- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మితిమీరుతున్న ఎంపీటీసీ భర్త ఆగడాలు.. ఏకంగా ఎమ్మెల్యే పేరుతోనే
దిశ, కోదాడ: మునగాల మండల పరిధిలోని గ్రామ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త ఆగడాలు హద్దులు దాటుతున్నట్లు తెలుస్తోంది. తన కారుపై ఎమ్మెల్యే బొమ్మ దాని కింద ఎరుపు అక్షరాలతో ఎమ్మెల్యే అని రాసుకుని యదేచ్ఛగా తిరుగుతూ ఆదివారం ‘దిశ’ పేపర్ నిఘా నేత్రానికి దొరికాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ఎమ్మెల్యేకి సంబంధించిన వాహనాలకి మాత్రమే స్టిక్కర్ వేసుకునే సౌకర్యం ఉంటుంది. కానీ, ఇలా ఎవరు పడితే వారు తమ వాహనాల మీద ఎమ్మెల్యే అని స్టిక్కర్ రూపంలో వేయించుకుని తిరగటం నిబంధనలకు విరుద్ధం. అయినా దీనిపై అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే ఏపీ 16 బి క్యూ. 7677 సెకండ్ హ్యాండ్ కారు మండల పరిధిలోని ఓ ఎంపీటీసీ కొనుగోలు చేయడం జరిగింది. ఆ కారుపై ఎంపీటీసీ భర్త ఎమ్మెల్యే బొమ్మ దాని కింద ఎరుపు అక్షరాలతో ఎమ్మెల్యే అని రాసుకుని యదేచ్ఛగా తిరగడం మొదలు పెట్టాడు. సదరు కారు నెంబర్ ని పోలీస్ చలానా యాప్ లో పరిశీలించగా ఈ వాహనం లాల్ బాబు షేక్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నట్లు చూపిస్తోంది. అదే విధంగా ఈ వాహనంపై 2018 అక్టోబర్, 2021 జూన్ లో రెండు చలానాలు కలిపి రూ.370 రూపాయలు నమోదై ఉన్నాయి.
స్థానికంగా అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి భర్త అయి ఉండి, విచక్షణా రహితంగా ఎమ్మెల్యే బొమ్మతో సహా ఎమ్మెల్యే అని స్టిక్కర్ వేయించుకొని యదేచ్ఛగా తిరుగుతున్నా స్థానిక పోలీసులు కానీ, అధికార యంత్రాంగం కానీ, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కానీ ఎటువంటి అభ్యంతరం తెలుపకపోవటంతో నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవికి ఉండే పేరుని ఈ విధంగా అప్రతిష్టపాలు చేయటం సబబు కాదని స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పిదాలు చేసే ప్రజాప్రతినిధులకు గుణపాఠం చెప్పాలని ప్రజలు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు.