ఆందోళన వద్దు.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం

by vinod kumar |
MLA Bollam Mallaiah Yadav
X

దిశ, అనంతగిరి: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో అందరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ వెంపటి వెంకటేశ్వర్లు- రూప ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలందరికీ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… ప్రజలందరూ కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా లాక్ డౌన్ పాటిస్తూ… ఇంటి వద్దనే ఉండాలన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతిఒక్కరూ మాస్కు, శానిటైజర్ ఉపయోగించాలి అన్నారు. కరోనాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తుందని తెలిపారు.

Next Story

Most Viewed