- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గంటా శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం..!

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasarao ) అలాగే విష్ణుకుమార్ రాజు ( Vishnu Kumar రాజు ) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరు మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి గంట శ్రీనివాస్, అలాగే విష్ణుకుమార్ రాజు మధ్య గ్యాప్ పెరిగినట్లు చెబుతున్నారు. తన నియోజకవర్గంలో... తనకు తెలియకుండా వేలు ఎందుకు పెడుతున్నారు అంటూ... గంటా శ్రీనివాస్ బహిరంగంగానే ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, అస్సలు సహించేది లేదని.. వార్నింగ్ కూడా ఇచ్చారట గంట శ్రీనివాస్. ఫిలింనగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని.. తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు అంటూ... విష్ణు కుమార్ రాజు పైన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయినట్లు చెబుతున్నారు.
ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లే సమయంలో... మీరు అందుబాటులో లేరని... గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారట విష్ణుకుమార్ రాజు. మీరు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించామని... వివరించారు. అయినప్పటికీ గంటా శ్రీనివాస్ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీరిద్దరి మధ్య గొడవ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.