- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పితృ వియోగం
by Shyam |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాకు పితృ వియోగం కలిగింది. శనివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే గణేష్ గుప్తా తండ్రి బీగాల కృష్ణమూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీగాల కృష్ణమూర్తి కి ఎమ్మెల్యే గణేష్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కో-ఆర్డినేటర్ మహేష్ గుప్తా సంతానం. బీగాల కృష్ణమూర్తి ఆర్య వైశ్య సంఘంలో క్రియాశీలక పాత్ర వహించారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కృష్ణమూర్తి స్వస్థలం మాక్లూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు టీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి గణేశ్ గుప్తాను పరామర్శించారు.
Next Story