- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అది నా వ్యక్తిగతం.. జగన్‌కు సంబంధం లేదు : భూమన
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నిన వరవరరావును విడుదల చేయాలని కోరుతూ తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన ఉపరాష్ట్రపతికి లేఖ రాశారు. దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ స్పందిస్తూ.. సీఎం జగన్ అనుమతి లేకుండానే ఆయన లేఖ రాశారా.. అందులో మీ ప్రమేయం లేకపోతే వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని సునీల్ దియోదర్ ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విమర్శించారు.
దీనిపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ అది నా వ్యక్తిగత అభిప్రాయం.. దానికి సీఎం జగన్‌కు సంబంధం లేదన్నారు. వరవరరావు విడుదల కోరుతూ గతంలో తాను ఉపరాష్ట్రపతికి రాసిన లేఖ వాస్తవమే అని.. కానీ, దానిని సీఎంకు ముడిపెడుతూ బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ ట్విట్టర్ ద్వారా విమర్శించడం తనను బాధించిందని ఎమ్మెల్యే భూమన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే సునీల్ దియోదర్‌కు ఎమ్మెల్యే భూమన లేఖ రాశారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశ్యం కాదని.. నేరస్తులను, హంతకులను తాను ఎన్నడూ సమర్థించనని పేర్కొన్నారు. 46ఏళ్ల కిందట తాను, వరవరరావు, వెంకయ్యనాయుడు ముగ్గురం ఒకే జైళ్లో ఉన్నామని గుర్తుచేశారు. శత్రువును చంపడం కంటే.. క్షమించడమే పెద్ద శిక్షని తాను నమ్ముతానని.. ఆ ఉద్దేశ్యంతోనే ఉపరాష్ట్రపతికి లేఖ రాశానని చెప్పుకొచ్చారు.