- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి
దిశ, అచ్చంపేట: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సందర్భంలో నియోజకవర్గంలోని అధికారులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు.
నియోజకవర్గంలోని చారకొండ మండల ఎంపీడీవో, ఎంపీపీ, జెడ్పీటీసీ, పోలీస్ శాఖ, ముఖ్యంగా వైద్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మండలంలో కరోనా కేసులు నివారణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఏ గ్రామాల్లో ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివరాలు తెలుసుకున్నారు.
అలాగే సామాజిక దూరం వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం మరిచిపోకుండా పాటించాలన్నారు. అలాగే మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తూ పనులు వేగవంతంగా కొనసాగేలా చూడాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.