నేషనల్ హైవే‌పై ప్రమాదకరంగా భగీరథ నీరు

by Sridhar Babu |   ( Updated:2021-11-06 00:23:54.0  )
నేషనల్ హైవే‌పై ప్రమాదకరంగా భగీరథ నీరు
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దరెడ్డిగూడెం ఎంపీపీఎస్ పాఠశాల వద్ద భద్రాచలం విజయవాడ జాతీయ రహదారి పై మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుకు గురికావడంతో సుమారు నెల రోజులుగా త్రాగు నీరు వృధాగా పోతుంది. ఇదే విషయంపై ఏఈ హరికృష్ణ వివరణ అడగగా అసలు అటువంటి సమస్య లేదని ఖరాఖండీగా సమాధానమిచ్చారు.

అయితే పెద్ద రెడ్డిగూడెం ఎంపీపీ ఎస్ విద్యార్థులు మాత్రం పాఠశాలకు వచ్చి వెళ్ళే క్రమంలో మిషన్ భగీరథ నీరు నిల్వ ఉండటం కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారని, గడిచిన నెల రోజుల్లో ఒకసారి మిషన్ భగీరథ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసి వెళ్లారు కానీ, అందువల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నీరు వృధాగానే పోతుందని, పిల్లలకు ఇబ్బందికరంగానే ఉందని పాఠశాల హెచ్ఎం పద్మ తెలిపారు. నేషనల్ హైవే కావడంతో రోజూ ఎన్నో వందల వాహనాలు ప్రయాణించే మార్గం గుండా మిషన్ భగీరథ నీరు భారీగా నిల్వ ఉండడం ప్రమాదకరంగా మారింది. సమస్యను పక్కదోవ పట్టించకుండా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed