రోడ్ల పాలవుతున్న మిషన్ భగీరథ.. సాక్షాత్తూ కేసీఆర్ చెప్పినా కూడా..

by Shyam |
water
X

దిశ, శంకర్ పల్లి: శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ నల్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ల స్వార్థం మూలంగా నాసిరకం పైపులు వేయడంతో పైపులు లీకేజ్ నీరంతా వృథాగా పోతోంది. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సంగారెడ్డి రోడ్డు దగ్గర నీరు లీకై రోడ్డు పక్కన బురదమయంగా తయారయింది. రోడ్డు వెంబడి మిషన్ భగీరథ నీరు సింగపూర్ వద్ద గల చాకర వాగు వరకు పారుతోంది. ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులు ఉన్నప్పటికీ ఏ వార్డ్ లో కూడా మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు.

వచ్చిన నాలుగైదు బిందెలు మినహా అంతకంటే ఎక్కువ నీరు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. శాసనసభ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని పూర్తి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించాడు. ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది కాని మిషన్ భగీరథ నీటి సరఫరా మాత్రం సక్రమంగా సరఫరా కావడం లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో సరఫరా అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ గంగ తెలిపారు. లీకేజీలను సరిచేసి నీటి సరఫరా సక్రమంగా అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed