- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ‘భగీరథ నీళ్లు’ వస్తలేవ్
దిశ, సిరిసిల్ల : మా కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. నెలల తరబడి ఇదే సమస్య ఎదుర్కొంటున్నాం. పరిష్కరిస్తారా లేదా అంటూ ఆ కాలనీ మహిళలు కౌన్సిలర్ ఇంటికి వెళ్లి అడిగారు. ఆ తర్వాత మునిసిపల్ కమిషనర్‌కు కూడా ఫోన్ చేసి తమ గోడు వెల్లబోసుకున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన మహిళలు స్థానిక కౌన్సిలర్ రాజేశంను అడిగారు.
మునిసిపల్ నల్లాల్లో నీరు సరిగా రావడం లేదని, తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కౌన్సిలర్ రాజేశంకు మహిళలు వివరించారు. దీంతో ఆయన కాలనీలోని గేట్ వాల్స్‌ను ఒకేసారి ఓపెన్ చేస్తుండటంతో కాలనీలోని అన్ని నల్లాల్లో నీరు సరిగా రావడం లేదని వివరించారు. తమకు నీటి సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, కౌన్సిలర్ ఎదుట తమ గోడు వెల్లుబోసుకున్నారు. అనంతరం స్థానిక మునిసిపల్ కమిషనర్‌కు కూడా ఫోన్ చేసి సమస్యను వివరించారు. ఇంజినీరును పంపించి నీటి సరఫరాలో జరుగుతున్న అంతరాయాన్ని పరిష్కరిస్తామని కమినర్ మహిళలకు వివరించారు.