మేజర్ కాకున్నా రజస్వలైతే చాలు.. పెళ్లి చేసుకోవచ్చు

by Sumithra |   ( Updated:2021-02-11 03:31:10.0  )
మేజర్ కాకున్నా రజస్వలైతే చాలు.. పెళ్లి చేసుకోవచ్చు
X

చండీగఢ్: మైనార్టీ(18ఏండ్లు నిండకున్నా) తీరకున్నా యుక్త వయస్సుకు వచ్చిన ముస్లిం బాలిక పెళ్లి చేసుకోవడానికి ముస్లిం చట్టాలు అనుమతిస్తున్నాయని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు వెల్లడించింది. ‘ముస్లిం పర్సనల్ లా’ 195 అధికరణం ప్రకారం యుక్త వయస్సును నిర్ధారించే ఆధారాల్లేకుంటే 15ఏళ్లు నిండితే చాలని, సదరు బాలిక పెళ్లికి అర్హురాలేనని తెలిపింది. మనోస్థితి సరిగా లేనివారైతే వారి సంరక్షకులు పెళ్లిపై నిర్ణయం తీసుకోవచ్చునని హైకోర్టు పేర్కొంది.

పంజాబ్‌కు చెందిన ముస్లిం దంపతులు(17ఏళ్ల యువతి, 36ఏళ్ల పురుషుడు) ముస్లిం చట్టాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నామని, కానీ, కుటుంబ సభ్యులు తమ వివాహాన్ని ఆమోదించడం లేదని, తమకు రక్షణ కల్పించాలని ఇరువురూ సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. వారి నుంచి రక్షణ కావాలని అభ్యర్థించారు. వీరి పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ అల్కా సరీన్ ఈ తీర్పు వెలువరించారు.

Advertisement

Next Story