- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమయానికి అన్నం తిని, టాబ్లెట్స్ వేసుకోమన్నందుకు..
దిశ, మహబూబాబాద్ : సమయానికి అన్నం తిని, టాబ్లెట్స్ వేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపం చెంది బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కొత్తగూడ ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవాణి గూడెంనకు చెందిన బిజ్జ నాగయ్యకు ముగ్గురు కుమార్తెలు.
వీరిలో రెండవ కుమార్తె బిజ్జా మానస (16)కు ఇటీవల కరోనా సోకి తగ్గిపోయింది. అప్పటి నుండి నీరసంగా ఉండటంతో సమయానికి ఆహారం, టాబ్లెట్లు తీసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీనితో మనస్థాపం చెందిన మానస ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి బిజ్జ నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.