- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాలయం నిర్మాణానికి భూమిపూజ..
దిశ,నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్ పెల్లి గ్రామంలో రూ 50 లక్షలతో నిర్మించనున్న రామాలయం నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక నిధులు కేటాయించి చామన్ పెల్లి గ్రామాన్ని అభివృద్ధి చేశామని అలాగే 60 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ వరిధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గ్రామానికి చెందిన అడవిలోకి వెళ్లే రోడ్ కోసం, హనుమాన్ ఆలయ మరమ్మతులు కోసం నిధులు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కొమ్ముల మహిపాల్ మంత్రి మీద అభిమానంతో కొమ్ముల మహిపాల్ నిర్మాణ సారథ్యంలో కొమ్ముల స్వామి రచించి పాడి రికార్డ్ చేసిన పాటను మంత్రి అల్లోల విడుదల చేసి వినిపించారు. ఈ పాట కోసం కృషి చేసిన మహిపాల్, స్వామిలను మంత్రి శాలువ, పులమాలతో సన్మానించారు. అనంతరం మండలంలోని పారపెళ్లి గ్రామానికి చెందిన బోటికెటి వెంకటికి 5 లక్షలు రైతు భీమా చెక్ ను అందించారు.