‘యాదాద్రిని చూసి ప్రపంచమే అబ్బుర పడుతుంది’

by Shyam |   ( Updated:2021-01-27 11:22:47.0  )
‘యాదాద్రిని చూసి ప్రపంచమే అబ్బుర పడుతుంది’
X

దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధాన ఆలయ నిర్మాణం పనులను చూసి ప్రపంచమే అబ్బుర పడుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం భూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డిలతో కలిసి ఆలయ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…యాదాద్రి ప్రధాన ఆలయం నిర్మాణ పనుల్లో స్థానిక ప్రజలు రాజకీయ నాయకులు రాజకీయాలకతీతంగా సహకారం అందించాలని కోరారు. ప్రస్తుత ఆలయం రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజానీకానికి కూడా ఔరా అనిపించే విధంగా ఉంటుందన్నారు. ఈ నిర్మాణం తిరుమలను తలపిస్తుందని అన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కావలసిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి:

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రధాన ఆలయంలో నిర్మాణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఆయన ఆర్‌అండ్‌బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో భూపాల్ రెడ్డితో ఆయన నూతన ప్రధానాలయాన్ని గర్భాలయం, తిరుమాడ వీధులు, రాజ ప్రాకారాలు, గండి చెరువు, అన్నదానం, కళ్యాణ కట్ట, వీఐపీ అతిథి గృహాలను ఆయన నిశి తంగా పరిశీలించారు. వీఐపీ అతిథి గృహాలలో ఆయన సుమారు మూడు గంటలపాటు పర్య వేక్షించి …ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ పనులను జరుపుకుంటూ పోతారని ఆర్‌అండ్‌బీ ఈ.ఈ వసంత నాయక్ , డిఈ శంకరయ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story