- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజల ప్రాణాలతో ప్రతిపక్షాలు చెలగాటం: తలసాని
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ప్రతిపక్షాలు చెలగాటం ఆడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. 2015లో సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించి కొత్త భవన నిర్మాణానికి ప్లాన్ చేశారన్నారు. కానీ అప్పుడు కొత్త బిల్డింగ్‌లు వద్దన్న దొంగలే నేడు డ్రామాలాడుతున్నాయని, వారికి మంచి ఆలోచన లేదన్నారు. ఇప్పుడు సచివాలయం కూడా కట్టొద్దని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఇక్కడో మాట, ఢిల్లీలో ఓ మాట మాట్లాడుతారని, కాంగ్రెస్ పార్టీకి నీతిలేదని దుయ్యబట్టారు. ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. భారీ వర్షానికి జలమయమైన ఉస్మానియా ఆస్పత్రుల్లోని పలు భవనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Next Story