- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు కరోనా అని డౌటా?.. ఐతే ఈ నంబర్ కి కాల్ చేయండి.
దిశ, మహబూబ్ నగర్ : మీకు కరోనా అని డౌటా..? అయితే వెంటనే 08542-241165 నంబర్ కు ఫోన్ చేసి సంబంధిత సిబ్బందికి సమాచారం ఇస్తే వైద్య పరీక్షలు అందుతాయని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో లో కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో మొత్తం 40 శాతం జనాభాకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ మన రాష్ట్రం నుండే సరఫరా అవుతుందని, మన రాష్ట్ర ప్రజలకు అవసరమైన మేరకు వైద్య సేవలు అందించి ప్రజలను కాపాడుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో కొంతమంది మీడియాలోనూ, మరికొంతమంది సామాజిక మాధ్యమాలలో కరోనా పరీక్షలు చేసే కిట్లు, అవసరమైన మోతాదులో ఆక్సిజన్ అందుబాటులో లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు మరింత భయాందోళనలకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించడానికి పోలీసు యంత్రాంగం వెనకాడబోదని మంత్రి హెచ్చరించారు.
మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాలతో కూడి ఉన్నది కావడం వల్ల ఇక్కడే ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి, అందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే జిల్లా వైద్యశాలతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ కరోనా వ్యాధి పరీక్షలు జరుగుతున్నాయన్నారు కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం ఉన్నట్లయితే 08542-241165 నంబర్ కు ఫోన్ చేసినట్లయితే అంబులెన్స్ అవసరమైన వారి ఇళ్ల వద్దకు చేరుకుంటుందని చెప్పారు. వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేసి అవసరమైతే అదే అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకొచ్చి చేరుస్తారు అన్నారు.
ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు త్వరగా కోలుకోవడానికి ఖరీదైన మందులు, ఆహారం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి అవసరం లేకపోతే వారి వారి ఇళ్లలోనే వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇదే సందర్భంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరఫున పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీని మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మొబైల్ క్లినిక్ బెస్ట్ అంబులెన్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారుఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పివెంకటేశ్వర్లు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పుట్టా శ్రీనివాసులు, డీ యం అండ్ హెచ్ వో కృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ కిషన్ , డిప్యుటీ సూపరిండెంట్ జీవన్,జిల్లా మలేరియా అధికారి జే విజయ్ కుమార్,వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.