- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. “జాతీయ చేనేత దినోత్సవాన్ని” పురస్కరించుకొని శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఎక్స్పో ప్లాజాలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చర్మ వ్యాధులు రావని, అంతేకాక శరీరాన్ని చల్లగా ఉంచుతాయని మంత్రి అన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని, కార్మికులను కాపాడాలని, చేనేతలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. చేనేతలకు ప్రోత్సాహంలో భాగం రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చేనేత వస్త్రాలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
జిల్లా కేంద్రంలో టెస్కో షోరూమ్ తో పాటు బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసే విషయంపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ మన వస్త్రాలు మన సంస్కృతికి నిదర్శనమని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతూ కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎక్స్ పో ప్లాజ నుండి తెలంగాణ చౌరస్తా వరకు చేనేత కార్మికులతో ర్యాలీని నిర్వహించారు.
- Tags
- mahaboobnagar