కేటీఆర్ చెప్పిండు.. శ్రీనివాస్ గౌడ్ చేసిండు

by Shyam |
కేటీఆర్ చెప్పిండు.. శ్రీనివాస్ గౌడ్ చేసిండు
X

దిశ, మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో మొక్కలు నాటారు. శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి మొక్కలను నాటి ప్రతి మొక్కనూ కాపాడుకుందాం అనే పిలుపు మేరకు తన నివాసంలో ఈత, జామ, అరెలియా, మందారం మొక్కలను తన కుమార్తె శ్రీహిత, మనుమరాలు సిద్దిక్షలతో కలసి నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో భారీగా మొక్కలు నాటి హరిత పట్టణాలుగా తీర్చిదిద్దటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Advertisement

Next Story