- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్ కల్లా పూర్తి చేయండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రైతు వేదికలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ చివరి నాటికి అన్ని క్లస్టర్‌లో నిర్మిస్తున్న రైతు వేదికలను పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ పనులు సెప్టెంబర్ చివరి నాటికి చేపట్టాలని, ఎనుగొండ దగ్గర ఏడు వందల ఇండ్ల పనులను ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఎకో పార్క్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అందుకు అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. అనంతరం నారాయణపేట జిల్లా నుంచి సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన రాహుల్‌ను మంత్రి సన్మానించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కవి భీంపల్లి శ్రీకాంత్ రాసిన చేనేత మొగ్గలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.