రోడ్డు ప్రమాదం.. బాధితుడిని ఆస్పత్రికి తరలించిన మంత్రి

by Shyam |   ( Updated:2020-04-15 07:59:38.0  )
రోడ్డు ప్రమాదం.. బాధితుడిని ఆస్పత్రికి తరలించిన మంత్రి
X

దిశ, మహబూబ్‌నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని గుర్తించి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాస్పిటల్‌కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ బంగ్లా బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదయ్య తీవ్రంగా గాయపడ్డారు. లాక్‌డౌన్ నేపథ్యంలో బాధితుడికి సహాయం అందించేవారు కరవయ్యారు. అయితే, చిన్నదర్పల్లి గ్రామానికి వెళ్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాయపడిన యాదయ్యను గుర్తించి కాన్వాయ్‌ను నిలిపివేశారు. తన కారులో బాధితుడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించి చిన్నదర్పల్లికి వెళ్లిపోయారు.
నిత్యావసరాల పంపిణీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మోతీనగర్, పాతతోట, కల్వరి కొండ, బోయపల్లి, సుభాష్ నగర్, సింహగిరి, కోయిల కొండ ఎక్స్ రోడ్డుల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ ఛైర్మన్ కేసీ నర్సింహులు బుధవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మోతీనగర్‌కు చెందిన షఫీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, ప్రేమ్స్ యోగ & మెడిటేషన్ సెంటర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు మాస్క్ లు, శానిటైజర్లు, సవారిన్ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

Tags: minister srinivas goud, humanity, accident,wounded man, hospital, mahabubnagar

Advertisement

Next Story

Most Viewed