పత్తి 70 లక్షలు కాదు… 65 లక్షల ఎకరాలే

by Shyam |
పత్తి 70 లక్షలు కాదు… 65 లక్షల ఎకరాలే
X

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిక పంటల సాగు విధానంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తే గంటల వ్యవధిలోనే అది ఐదు లక్షల ఎకరాలు తగ్గి 65 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ఏయే పంటను ఎన్ని ఎకరాల్లో సాగుచేయాలో రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమగ్ర వ్యవసాయ ప్రణాళికను శనివారం విడుదల చేశారు. ఆ ప్రకారం ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలో స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ నూతన విధానాన్ని తీసుకురావాల్సి వచ్చిందన్నారు. వర్షాకాలంలో రాష్ట్రం మొత్తం మీద 1.30 కోట్ల ఎకరాల్లో పంటలను పండించాలని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

ఆ ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో సాగుచేయాల్సిన పంటలు, వాటి విస్తీర్ణం

వరి : 41,76,778 ఎకరాలు
పత్తి : 65,00,000 ఎకరాలు
కందులు : 12,51,958 ఎకరాలు
సోయాబీన్ : 4,08,428 ఎకరాలు

మిగిలిన సాగుభూముల్లో జొన్న, పెసలు, మినుములు, ఆముదం, వేరుశెనగ, చెరకు తదితర పంటలు పండించాలని మంత్రి పేర్కొన్నారు. వానా కాలానికి కేంద్రం 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు. వానాకాలం పంటల కోసం విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed