గాంధీనా, పూలేనా?… ఆంబోతు, అవినీతి పరుడు: శంకరనారాయణ

by srinivas |
గాంధీనా, పూలేనా?… ఆంబోతు, అవినీతి పరుడు: శంకరనారాయణ
X

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ సొమ్మును కాజేసీన వ్యక్తిని ఏమనాలి? అంటూ వైఎస్సార్సీపీ మంత్రి శంకరనారాయణ ప్రశ్నించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేయడంపై ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే, ఓర్వలేని ఓ ఆంబోతు, ఓ అవినీతిపరుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. ఇప్పుడా అవినీతిపరుడు అరెస్ట్ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడేమైనా మహాత్మా గాంధీనా, లేక పూలేనా అంటూ ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు దొరికింది చిన్నపాములేనని, ఇందులో చంద్రబాబు పాత్ర ఎంత, లోకేశ్ పాత్ర ఎంత అనేది ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన సూచించారు. అవినీతికి పాల్పడిన వాళ్లపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. అచ్చెన్నాయుడు ఐదేళ్లలో మంత్రిగా ఉంటూ బీసీలకు చేసిందేమిటి? ఆయన దోపిడీ కారణంగా నష్టపోయింది బీసీలు కాదా? అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed