- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎలుకలు కొట్టిన డబ్బులు ఇప్పిస్తా.. బాధితుడికి ఫోన్ చేసిన మంత్రి
by Shyam |
X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వేంనూరు గ్రామ పంచాయితీ పరిధిలోని ఇందిరా నగర్ తండా గ్రామ పంచాయితీకి చెందిన భూక్య రెడ్యా నాయక్ కంతి ఆపరేషన్ నిమిత్తం దాచుకున్న రూ.2 లక్షలును ఎలుకలు కొట్టిన విషయం తెలిసిందే. దీనితో బాధిత రైతు కన్నిటిపర్యంతమవుతున్నాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం రెడ్యా నాయక్‌తో ఫోన్‌లో పరామర్శించారు. పనికిరాకుండా చిరిగిన నోట్లను తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు మహబూబాబాద్ తహశీల్దార్ రంజిత్ బాధితుని ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడొద్దు అని తెలిపారు.
Advertisement
Next Story