ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం : మంత్రి సత్యవతి

by Shyam |   ( Updated:2021-07-02 06:52:21.0  )
Minister Satyavathi Rathod
X

దిశ, చిట్యాల: ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలలో 4వ విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి, జడల్‌పేటలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దూరదృష్టితో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ప్రతి వైద్యుడు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్న అన్నారు.

సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళ కళ్లల్లో ఆనందం చూడటమే కళ్యాణాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పెళ్లింట సంతోష వాతావరణం ఉండాలనే సంకల్పంతో ఈ పథకం నుంచే నగదును వధువు కుటుంబానికి బహుమతిగా అందిస్తున్నామని పేర్కొన్నారు. చిట్యాల మండల కేంద్రానికి మొదటి సరిగా రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కార్యాలయంలో అభివృద్ధిలో ముందంజలో ఉండడానికి ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడిషనల్ కలెక్టర్ రిద్వాన్ భాష షేక్, జెడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీఓ పురుషోత్తం, డీపీఓ ఆశాలత, ఎంపీపీ ధావు వినోద, జెడ్పీటీసీ గొర్రెసాగర్, వైస్ ఎంపీపీ రాంబాబు, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంపీవో శంకర్రావు, ఎపీవో అలిమ్ పాషా, ఎంపీటీసీ కట్కూరి పద్మ, సర్పంచులు పూర్ణచందర్, రత్నాకర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు రాజ్ మహమ్మద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed