ఊహించని విధంగా అభివృద్ధి : స‌త్య‌వ‌తి రాథోడ్‌

by Sridhar Babu |
ఊహించని విధంగా అభివృద్ధి : స‌త్య‌వ‌తి రాథోడ్‌
X

దిశ, న‌ల్ల‌గొండ‌: ఆసాధ్యాల‌ను సుసాధ్యం చేయడంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దిట్ట అని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. గురువారం రాష్ట్ర ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత‌, జిల్లా శిశుసంక్షేమాధికారి కృష్ణ‌వేణితో క‌లిసి ఆమె యాదాద్రి ల‌క్ష్మీ నరసింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఆనంత‌రం మీడియాతో ఆమె మాట్లాడారు. క‌ల‌లో సైతం ఊహించ‌ని విధంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ధీటుగా తెలంగాణ‌లో యాదాద్రి ఆల‌యాన్ని అభివృద్ధి చేయ‌డం సీఎం కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్య‌మైంద‌న్నారు. కేసీఆర్‌కు భ‌క్తి భావం ఉండ‌టంతో తెలంగాణ‌లోని ఆల‌యాల అభివృద్ధికి మోక్షం దొరికింద‌న్నారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి.. తెలంగాణ‌కు గీటురాయిగా నిలుస్తుంద‌న్నారు. బంగారు తెలంగాణ‌కు బాట‌లు వేస్తోన్న సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆరోగ్యాలతో జీవించాల‌ని శ్రీలక్ష్మి స‌మేత నరసింహస్వామిని వేడుకున్న‌ట్టు ఆమె తెలిపారు.

Tags: minister satyavathi rathod, cm KCR, gongidi sunitha, yadadri temple development

Next Story

Most Viewed