- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ తప్పులు మళ్లీ చేయొద్దు.. ఓకేనా ? : మంత్రి సత్యవతి
దిశ, ములుగు: సమ్మక్క సారలమ్మ మహా జాతర – 2022 ను ఘనంగా నిర్వహించి, వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా పొందే విధంగా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. గత జాతరలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత మెరుగ్గా పని చేయాలన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర – 2022 ఏర్పాట్లపై సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత జాతర పూర్తి అయ్యాక మన దగ్గర కరోనా లాక్ డౌన్ విధించాం.. ఈసారి జాతరకు ముందే కరోనా మహమ్మారి సంపూర్ణంగా నశించేలా చూడాలని అమ్మవార్లను కోరుకున్నట్లు ఆమె తెలిపారు. చుట్టుపక్కల జరిగే పిల్ల జాతరలకు కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈసారి కూడా కలిసి కట్టుగా పనిచేసి, ఇక్కడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి అమ్మవార్ల ఆశీస్సులు అందేలా కృషి చేద్దామన్నారు. ఇప్పటికే 120 కోట్ల రూపాయలు ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపించారని ఆమె తెలిపారు. మూడు చెక్ డ్యామ్ లు తీసి వేయాలని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించినట్లు మంత్రి పేర్కొన్నారు.