- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీట మునిగిన కాలనీలు పరిశీలించిన మంత్రి
by Shyam |

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన కాలనీలను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. వరంగల్ జిల్లాలోని అమరావతి నగర్లో నాలాను మంత్రి పరిశీలించారు. అనంతరం సంతోషి మాత గార్డెన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న ప్రజలతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మేయర్ ప్రకాశ్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతి ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ క్రింద రూ.50కోట్లు ప్రత్యేకంగా రూ.25 కోట్లు మంజూరుకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆ ప్రాంతాలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ఈ మేరకు పూర్తి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story