కళాశాలల్లో ఎన్ఓసీ సమస్యను పరిష్కరించండి

by Shyam |
కళాశాలల్లో ఎన్ఓసీ సమస్యను పరిష్కరించండి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని కాలేజీలకు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ జారీపై హోం మంత్రి మహమూద్ అలీతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించారు. ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ విషయం లక్షలాది విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం చూపుతోందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమస్యకు పరిష్కారం చూపాలని హోంమంత్రిని కోరారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడమే ప్రధానం అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు, వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో విద్యా శాఖ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్, హోం శాఖ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed