- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిగ్రీ, పీజీ పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో డిగ్రీ, పీజీ, డిప్లొమో పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి సబిత మీడియాతో మాట్లాడుతూ.. కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్ జీవో 46ను అమలు చేయాలని తెలిపారు. జీవో ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. నెల వారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించుకోవాలని విద్యాసంస్థలను కోరినట్టు మంత్రి సబిత పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుగుతాయని వెల్లడించారు. జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు. టీసాట్, దూరదర్శన్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు.