ప్రజాప్రతినిధులకు మంత్రి పువ్వాడ క్షమాపణ

by Shyam |   ( Updated:2020-03-12 06:48:44.0  )
Puvada
X

దిశ, హైదరాబాద్
తెలంగాణ శాసనమండలిలో గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులకు ఓ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రి ఎవరోకాదు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గురువారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఓ సభ్యుడు ప్రస్తావించారు. దీనిపై అజయ్ స్పందిస్తూ ప్రజాప్రతినిధులు కాల్ చేసినప్పుడు ఆర్టీసీ అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవటం ముమ్మాటికీ తప్పేనని, అందుకు క్షమాపణ చెబుతున్నాని అన్నారు.

Tags: minister puvvada Forgiveness, assembly session,This is it wrong

Advertisement

Next Story

Most Viewed