జీహెచ్ఎంసీ తరహాలో పనులు పూర్తి చేయాలి: మంత్రి పువ్వాడ

by Sridhar Babu |
జీహెచ్ఎంసీ తరహాలో పనులు పూర్తి చేయాలి: మంత్రి పువ్వాడ
X

దిశ‌, ఖ‌మ్మం :
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన అనేక అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ తరహాలోనే పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరైన పనులకు కరోనా వైరస్ నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడిందని, అందువల్లే పనులు ఆగిపోయాయన్నారు. ఈ వేసవిలోనే పనులు అన్నింటిని పూర్తి చేయాలని, లేనియెడల వచ్చే వర్షాకాలంలో పనులు చేయడం సాధ్యపడదని భావించిన మంత్రి అధికారులతో మాట్లాడారు.ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో బీటీ పనుల‌ను తక్షణమే ప్రారంభించాలని కార్పొరేషన్, ఆర్&బీ అధికారులను ఆదేశించారు. బోస్ బొమ్మ సెంటర్, చర్చ్ కాంపౌండ్ సెంటర్, దంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జి అనుసంధానం, బీటీ రోడ్, ముస్తఫానగర్ సెంటర్‌లో ప్రారంభమైన పనులను నేడు పువ్వాడ అజయ్ కుమార్ ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మంలో మేయర్ పాపాలాల్ , మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ అనురాగ్ జయంతి , ఆర్‌ అండ్‌ బీ ఈఈ శ్యామ్ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ అధికారి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: lockdown, labour scarcity, minister puvvada ajay, pending works


👉 Read Disha Special stories


Next Story

Most Viewed