- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అడ్డుకునేందుకే బఫూన్ గాళ్ల డ్రామాలు‘
దిశ, ఖమ్మం ప్రతినిధి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కొందరు కుట్రదారులు కుటిల రాజకీయాలు చేస్తున్నారని, వారికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్, ఆధునీకరించిన మూడు బొమ్మల సెంటర్ ప్రారంభోత్సవం సోమవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంత మంది బఫూన్ గళ్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మెచ్చారు కాబట్టే ప్రజలు టీఆర్ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న కేసీఆర్‌కు ఖమ్మం కార్పొరేషన్ పీఠాన్ని కానుకను అందిద్దామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి నిత్యం తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మహనీయుడు కేసీఆర్ అని.. ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేయగలుగుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి తర్వాత ఖమ్మం నగరమంతా మంచి నీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి తెలిపారు. అంతకముందు ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలో 207 మంది లబ్ధిదారులకు రూ.2.07 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు.