చిడతలు కొట్టి డబ్బు సంపాదించడంలో పవన్ దిట్ట: పేర్ని నాని

by srinivas |
చిడతలు కొట్టి డబ్బు సంపాదించడంలో పవన్ దిట్ట: పేర్ని నాని
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. చిడతలు వాయిస్తూ డబ్బు సంపాదించడంలో పవన్ కల్యాణ్ దిట్ట అని, పవన్ కల్యాణ్‌ అంత గొప్పగా ఎవరూ చిడతలు కొట్టలేరని వ్యాఖ్యానించారు. హైటెక్స్‌లో మీటింగ్‌లు పెట్టి ప్రధాని మోడీకి, చంద్రబాబుకు చిడతలు కొట్టింది పవన్ కల్యాణ్ కాదా అని ప్రశ్నించారు. నేను ఏం చేసినా వైఎస్ కుటుంబానికే చేస్తానన్న మంత్రి పేర్ని నాని.. వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని స్పష్టం చేశారు. చంద్రబాబు రైతులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. కొడాలి నాని అంటే పవన్‌ కల్యాణ్‌కు భయమన్నారు.

నివర్ తుఫాన్ నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో వేశామని, నష్టం జరిగిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం ఇదే తొలిసారి అన్నారు. 13.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 18నెలల్లో రైతుల కోసం రూ.61వేల 400 కోట్లు ఖర్చు చేశామని మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

Advertisement

Next Story