- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ధర్నా చేస్తే నేనూ వస్తా: పేర్ని నాని
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం జెట్ స్పీడుతో దూసుకుపోతుంటే.. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం రాకెట్ కంటే వేగంతో పెంచుతోందని ఆరోపించారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా కేంద్రం ధరలు పెంచుతుందన్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110కి తీసుకెళ్లిన కేంద్రం ఇప్పుడు రూ.5 తగ్గించి గొప్పలు చెప్పకుంటుందని మంత్రి మండిపడ్డారు.
కేంద్రం ధరలను రోజువారీగా పెంచుకుంటూ పోతుందని విమర్శించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోడీని డిమాండ్ చేయాలని సలహా ఇచ్చారు. బీజేపీ నేతలు ధర్నా చేస్తే తాను కూడా హాజరవుతానని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచి రూ.5 తగ్గించిందని ఎద్దేవా చేశారు. ప్రజాబలం ఉన్న వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ, టీడీపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాటిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.