అంతర్వేది ఘటనపై విచారణకు ఆదేశం..

by  |
అంతర్వేది ఘటనపై విచారణకు ఆదేశం..
X

దిశ,వెబ్‌డెస్క్ :

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రమాదానికి గల కారణాలు తెలపాలని విచారణకు ఆదేశించారు.ఈ విషయం పై దేవాదాయ కమిషనర్, జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్‌లో సంభాషించారు. అనంతరం విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను నియమించారు. వీలైనంత త్వరగా రథం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదిలాఉండగా, అంతర్వేది ఆలయం వద్ద గ్రామస్తులు, VHP నేతలు ఆందోళనకు దిగారు. ఆలయ ఈవో ఆఫీసు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. రథం దగ్ధం విషయంపై ఈవో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ సీసీ కెమెరాలు పోయి 6నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవో వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలపగా.. వారికి మద్దుతుగా ఆలయం వద్దకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేరుకుని ఆందోళన తెలిపారు.


Next Story

Most Viewed