కొత్తపల్లి మృతుల కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |
Niranjan Reddy
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో ప్రమాదభరితంగా ఉన్న ఇండ్లు, ఇతర నిర్మాణాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed