- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వాయిస్ నాదికాదు.. నాకే వందల ఎకరాలు ఉన్నాయి : స్పందించిన మల్లారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ఓ వెంచర్ విషయంలో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ నగర శివారు శామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలో 67 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశాడు. అయితే సర్పంచ్‌కు వాటా ఇస్తే సరిపోతుందా, ఎమ్మెల్యే ఉన్నడు మంత్రి ఉన్నడు కనపడ్త లేదా అని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆ ఆడియో టేప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని, ఎవరో మిమిక్రీ చేశారని అన్నారు. ప్రస్తుతం నగరంలో మిమిక్రీ చేసేవాళ్లు ఎక్కువయ్యారని, నాకు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాయిస్ రికార్డుపై దేనికైనా సిద్ధం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకే వందల ఎకరాలు ఉన్నాయని, వేరేవాళ్ల భూములు నాకు అవసరం లేదని వెల్లడించారు.